Pooja Hegde : ఆరెంజ్ ఔట్​ఫిట్​లో పూజా హెగ్డే మెస్మరైజింగ్ లుక్స్

-

పూజా హెగ్డే ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ ప్రస్తుతం బాలీవుడ్​లో సెటిల్ అయినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్​తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే సినిమాలో నటించింది. కాటమరాయుడు మూవీకి రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విక్టరీ వెంకటేశ్ పూజా హెగ్డే అన్నయ్యగా నటిస్తున్నారు.

ప్రస్తుతం పూజ ఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. రోజుకో ఔట్​ఫిట్​లో ఈ బ్యూటీ ప్రమోషన్స్​లో పాల్గొంటోంది. తాజాగా బుట్టబొమ్మ ఆరెంజ్ కలర్ ఔట్​ఫిట్​లో కనిపించింది. టైట్​ఫిట్ డ్రెస్సులో పూజ తన అందాలు ఆరబోసింది. విరహ వేదనతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది.

పూజా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు బుట్టబొమ్మపై మనసు పడుతున్నారు. పూజా.. కమ్ బ్యాక్ టు టాలీవుడ్ అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. మరికొందరేమో బుట్టబొమ్మ కాస్త సన్నబడినట్టుందని కామెంట్లు చేస్తున్నారు. పూజా రోజురోజుకు మరింత అందంగా తయారవుతోందని నెటిజన్లు పొగిడేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news