ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఝార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని ఎన్ని రికార్డులు సృష్టించాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను అధిగమించాడు. కాగా తాజాగా మరో రికార్డు ధోని ఖాతాలో పడింది. ఐపీఎల్ మొత్తం లో ఇప్పటి వరకు ఆఖరి ఓవర్ లో అంటే 20వ ఓవర్ లో ఫినిషింగ్ చేయాల్సిన సమయం.. ఆ ఓవర్ లో సిక్సులు కొడితేనే మ్యాచ్ ను గెలిపించగలం, అదే విధంగా ఫస్ట్ బ్యాటింగ్ అయితే మంచి టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచగలం. ఈ విషయంలో ధోనిని మించిన గొప్ప ఫినిషర్ ఎవరుంటారు.
ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ లో ధోని 20వ ఓవర్లో 57 సిక్సులతో ఎవ్వరికీ అందనంత టాప్ లో ఉన్నాడు. ఇక ధోని తర్వాత స్థానాలలో 33 సిక్సులతో పోలార్డ్, 26 సిక్సులతో జడేజా, 25 సిక్సులతో హార్దిక్ మరియు 23 సిక్సులతో రోహిత్ శర్మ ఉన్నారు. కాగా ఇప్పటికిప్పుడు ధోని రికార్డును అందుకోలేరని చెప్పాలి.