Pooja hegde : రాధేశ్యామ్ నుంచి ప్రేరణ వచ్చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరో గా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా.. యువి క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ స‌ర‌స‌న టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే… పుట్టిన రోజు నేపథ్యంలో… ఆమె లుక్స్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సినిమాలో ప్రేరణ అనే క్యారెక్టర్ చేస్తున్న నేపథ్యంలో…. ఆ పేరుతోనే పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇందులో లో వైట్ డ్రెస్ లో అందరినీ ఆకట్టుకుంటోంది పూజా హెగ్డే. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అంటే జనవరి 14 తేదీన థియేటర్లలో విడుదల కానుంది.