సమంత, నయనతార దారిలో పూజా హెగ్డే

-

పూజా హెగ్డే ఓ బేబిలా కనిపిస్తే ఎలా వుంటుంది.. బుట్టబొమ్మ అరుంధతిలా ఉగ్రరూపం దాలిస్తే ఇలా పూజాని ఊహించుకోవడం కష్టంగా ఉందా..ఈ గ్లామర్ డాల్‌ త్వరలో పెర్‌ఫార్మెన్స్‌ అవతారం ఎత్తనుంది. ఛాన్స్ వస్తే ఉమెన్‌ సెంట్రిక్‌ క్యారెక్టర్‌ పోషించడానికి రెడీ అంటోంది పూజా.

సమంత..అనుష్క..నయనతార కెరీర్‌ స్టార్టింగ్‌లో గ్లామర్‌ రోల్స్‌ పోషించినా.. ఎట్టకేలకు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో తామేమిటో నిరూపించుకున్నారు. అరుంధతి తర్వాత అనుష్క లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కు మెయిన్‌ ఛాయిస్‌గా నిలిచింది. ఇక నయనతార అయితే.. వరుసపెట్టి అలాంటి మూవీసే చేస్తోంది.

ఇక సమంత అయితే..డెబ్యూ మూవీతోనే మాయ చేయడం స్టార్ట్‌ చేసింది. మనం మూవీ హైలైట్స్‌లో సామ్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా ఒకటి. పెళ్లి తర్వాత మనసు మార్చుకున్న సామ్‌ యు టర్న్‌ తీసుకుని… ఓ బేబితో మెప్పించింది. మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ కోసం వెయిట్ చేస్తూ.. ఈలోగా.. వెబ్‌ సిరీస్‌ .. సామ్‌జామ్‌ టాక్‌ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది.

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ మనసు ఈ మధ్య ఉమెన్‌ సెంట్రిక్‌ క్యారెక్టర్‌ వైపు చూస్తోంది. ఇప్పటికే కావాల్సినంత గ్లామర్ గుప్పించిన ఈ అమ్మడు… నటిగా కూడా నిరూపించుకోవాలనుకుంటోంది. ఈక్రమంలో మంచి కథ వస్తే.. లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేయడానికి రెడీ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బుట్టబొమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news