రానాను పవన్‌ డామినేట్‌ చేస్తాడా ?

-

ఆ సినిమాలో పవన్‌కల్యాణ్‌తోపాటు మరో స్టార్ హీరోకు చోటుంది. క్యారెక్టర్‌ రీత్యా పవన్‌కు ఇగో ఎక్కువ. ఈయనకు ఏమాత్రం తగ్గని రోల్‌ మరోకటి. నువ్వా నేనా అన్నట్టు పోటీపడాలి. పవన్‌కు ధీటుగా నటించే సెకండ్‌ రోల్‌ కోసం వెతికితే… కన్నడ.. తమిళ హీరోల పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు తెలుగు హీరో రానాను సెలెక్ట్ చేశారు.

పృథ్వీరాజ్‌.. బీజూ మీనన్‌ నటించిన మాలయాళ మూవీ ‘అయ్యప్పనమ్‌ కోషియమ్‌’ ఘన విజయం సాధించింది. బీజూ మీనన్‌ అయ్యప్నగా.. పృథ్వీరాజ్‌ కోషియమ్‌గా పవర్‌ఫుల్‌ రోల్స్‌ పోషించారు. వీళ్ల యాక్టింగ్‌కు మాలీవుడ్‌ ఫిదా అయిపోయి.. బ్రహ్మరథం పట్టింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌ రైట్స్‌ను హారిక హాసిని క్రియేషన్స్‌ అనుబంధం సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. పవన్‌కల్యాణ్‌ను అయ్యప్పన్‌ పాత్రకు ఎంచుకుంది. ఇందులో క్రాక్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా పవన్‌ కనిపిస్తాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పవన్‌తో సినిమా ఎనౌన్స్‌ చేసినా ఇది అయ్యప్పనమ్‌ కోషియమ్‌కు రీమేక్‌ అని చెప్పలేదు. మన నేటివిటి.. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు శేఖర్‌ చంద్ర. రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నప్పటినుంచీ.. కోషియమ్‌ పాత్రకు రానా పేరు వినిపిస్తూనే వుంది. మధ్యలో కన్నడ సూపర్‌స్టార్స్‌ సుదీప్‌.. తమిళ హీరో విజయ్‌ సేతుపతి పేర్లు వినిపించినా.. చివరికి భల్లాళ దేవుడినే ఫిక్స్‌ చేశారు.

రానాను టీంలోకి ఆహ్వానం పలుకుతూ.. చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియోను పంచుకుంది. దేవుని పటాలపై పవన్‌ క్లాప్‌ ఇవ్వడంతో.. సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. పవన్‌కు పోటీ ఇచ్చే హీరోగా రానా బరిలోకి దిగాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు దెబ్బ తీసుకునే ఎత్తుగడలు వేస్తూ వుంటారు. తిట్టుకుంటారు.. సవాల్స్‌ విసురుకుంటారు. అక్కడితే ఆగరు… కొట్టుకుంటారు. ఈక్రమంలో ఎవరు ఎవర్ని డామినేట్ చేస్తారా? అన్న లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు.

దొంగ దెబ్బ తీయడంలో పవన్‌ కంటే రానా కాస్త ఆరితేరాడు. బాహుబలిలో సోదరుడు బాహుబలితో మంచిగానే వుంటూ.. కుళ్లు కుతంత్రాలతో అధికారం చేజిక్కించుకుంటారు. పవన్‌ ఇలాంటి రోల్‌ వేయడం ఇదే ఫస్ట్ టైం. అయితే.. తనకున్న క్రేజ్‌తో నెట్టుకొస్తాడా? లేదంటే.. రానాను మించి యాక్టింగ్‌ చేస్తాడా? ఇలా… అయ్యపనమ్‌ కోషియమ్‌ రీమేక్..ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news