ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఇంకా వదలనే లేదు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కొత్త వైరస్ కలవర పెడుతోంది. యూకేలో గుర్తించిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పాకుతోంది. దీంతో ఈ సరి ప్రపంచ దేశాలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా మరో సారి లాక్‌డౌన్ విధిస్తూ భూటాన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. రాజధాని సహా మరికొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరగడంతో పటు కొత్త కరోనా టెన్షన్ తో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా అన్ని అత్యవసర సేవలు అందు బాటులోనే ఉండనున్నాయి. కానీ స్కూళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు మూసివేస్తామని అధికారికంగా ప్రకటించింది.