కమల్‌హాసన్‌తో బంధం పై పూజా కుమార్ క్లారిటీ ఇచ్చినట్టేనా

పూజా కుమార్ గురించి తమిళనాడులో ఏవేవో ప్రచారాలు జరిగాయి. కమల్‌హాసన్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోందని, కమల్ ఫ్యామిలీకి పూజ కనెక్ట్ అయ్యిందనే మాటలు కూడా వినిపించాయి. ఇలాంటి ప్రచారాలన్నింటికి ఒకే ఒక్క పోస్ట్‌తో సమాధానం చెప్పేసింది పూజ. చేతిలో బిడ్డతో ప్రత్యక్షమై అందరి నోళ్లకి తాళం వేసింది.

అమెరికా నుంచి వచ్చి ఇండియన్‌ ఫిల్మ్స్‌లో నటిస్తోన్న పూజా కుమార్ కమల్‌ హాసన్‌తోనే ఎక్కువ సినిమాలు చేసింది. ‘విశ్వరూపం, విశ్వరూపం2, ఉత్తమవిలన్’ సినిమాల్లో కమల్‌తో కలిసి సందడి చేసింది. ఈ మూవీస్‌ టైమ్‌లో కమల్‌తో చాలా క్లోజ్ అయ్యింది పూజా కుమార్. ఎంత క్లోజ్ అయ్యిందంటే కమల్ హాసన్‌ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి కూడా పూజా కుమార్‌ని తీసుకెళ్లేవాడు. దీంతో వీళ్ల మధ్య ఫ్రెండ్‌షిక్‌కి మించిన రిలేషన్‌ ఉందనే టాక్ వచ్చింది.

గౌతమితో విడిపోయాక కూడా పూజా కుమార్‌ని ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి తీసుకెళ్లాడు కమల్‌ హాసన్‌. దీంతో కోలీవుడ్‌లో వీళ్లిద్దరి రిలేషన్‌ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే చెన్నైలో ఎన్ని మాటలు వినిపిస్తున్నా పూజా కుమార్‌ మాత్రం ఎప్పుడూ రియాక్ట్‌ కాలేదు. రీసెంట్‌గా పూజా కుమార్‌కి పెళ్లైంది, కూతురు పుట్టిందనే పోస్ట్‌తో తమిళనాడు అంతా ఆశ్చర్యపోతోంది.

పూజా కుమార్ భర్త విశాల్‌ జోషి ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా ఒక పోస్ట్‌ పెట్టాడు. ఒకప్పుడు మా ప్రయాణం ఇద్దరిగా మొదలైంది. ఇప్పుడు మేం ముగ్గురమయ్యాం. నేను, పూజా కలిసి మా కూతురు నవ్య జోషిని పరిచయం చేస్తున్నామని పోస్ట్‌ పెట్టాడు.

విశాల్‌ జోషి కూడా అమెరికాలోనే ఉంటున్నాడు. సిలికాన్‌ వ్యాలీలో ‘జాయ్’ అనే వెడ్డింగ్ ప్లానింగ్‌ కంపెనీని రన్‌ చేస్తున్నాడు. ఇక విశాల్‌ ఈ ఫోటోస్‌ పోస్ట్‌ చెయ్యగానే కోలీవుడ్ మొత్తం సర్‌ప్రైజ్ అవుతోంది. పూజా కుమార్‌ ప్రైవేట్‌గా పెళ్లి చేసుకుందా, ఎవ్వరికీ చెప్పనే లేదని మాట్లాడుకుంటున్నారు.