టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై పూనమ్ కౌర్ సంచలనం !

ప్రస్తుతం డ్రగ్స్‌ కేసు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరి పేరు బయటకు వస్తుందోనని.. సినీ తారలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యం లో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు పై నటి పూనమ్ కౌర్ స్పందించారు. డ్రగ్ అనేది ఒక్క సెలెబ్రెటీ విషయం మాత్రమే కాదని… డ్రగ్ పొలిటికల్- బార్డర్- ఆర్థికపరమైన విషయం కూడా అని నటి పూనమ్ కౌర్‌ అన్నారు.

టాలీవుడ్ డ్రగ్ విషయం పై త్వరలో మాట్లాడుతానని…ఇది తన వ్యక్తిగత అనుభవమని తెలిపారు. అయితే… ఈ డ్రగ్స్‌ కేసు పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని పూనమ్ కౌర్ స్పష్టం చేశారు. కాగా… ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈడీ విచారణ లో ఉంది. ఉదయం ఈడీ విచారణకు హజరైంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అయితే.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఎఫ్‌ క్లబ్‌ పార్టీ తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. నవదీప్‌కు చెందిన ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌ కాల్‌ లిస్ట్‌లో రకుల్‌ ఉంది. మేనేజర్‌ ఆర్ధిక వ్యవహారాలలో రకుల్‌ పేరుతో పాటు… రకుల్‌, నవదీప్‌, కెల్విన్‌ మధ్య లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కోణంలోనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు.