పవన్ కల్యాణ్ ట్వీట్​పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ

జనసేన అధినేత, టాలీవుడు స్టార్‌ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఫాలోయింగ్‌ మాములుగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పవన్‌ కళ్యాణ్‌ కు ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఓ ట్వీట్‌ పై తమిళనాడు అసెంబ్లీ లో చర్చ జరిగింది. శాసన సభ లో ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర మణియన్‌ ప్రసంగిస్తూ… ఈ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు.

ప్రతి పక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందరినీ భాగస్వాములను చేస్తూ… వారికి సముచిత గౌరవం కలిపిస్తూ.. పరిపాలన చేస్తుండడాన్ని పవన్‌ తన ట్వీట్‌ లో ప్రశంసించారు. ప్రభుత్వంలోని రావడానికి రాజకీయాలు చేయాలే తప్ప… అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదనే మాటలను చేతల్లో చూపిస్తున్నానని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ తమిళ నాడు శాసన సభ లో తమిళంలోపాటు తెలుగులోనూ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ అరుదైన ఘటన పై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.