అవతార్ 2 సినిమాను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ..!

-

2009లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2 సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామరూన్.. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురు చూసిన అవతార్ 2 సినిమా డిసెంబర్ 16వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం థియేటర్స్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయ్యి ఇప్పటికే కొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసింది. భారీ ఓపెనింగ్స్ తో అదరగొట్టిన అవతార్ 2 ఇప్పటికి అదే దూకుడుతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. సుమారు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది. మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.34.22 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అవతార్ 2 సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందని సమాచారం. అయితే అవతార్ సినిమా సుమారు 234 రోజుల తర్వాతనే ఓటీటీ లో ప్రసారం కానుందని కూడా తెలుస్తోంది. అవతార్ సినిమా 3D, 4DX టెక్నాలజీ తో అందుబాటులో ఉంది.దాంతో సామాన్యులకు టికెట్ భారం పడుతుంది. అందుకే చాలామంది ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి షాక్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ.. ఈ సినిమా ఓటీటీ లోకి రావాలి అంటే 234 రోజులు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version