కేసీఆర్ వల్లనే సేఫ్, టీఆర్ఎస్ ని గెలిపించండి : పోసాని

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓట్లు వేసి గెలిపించాలని… టీఆర్ఎస్ అభ్యర్థిని మేయర్ గా గెలిపించాలని కోరుతున్నానని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజా సేవ బాగానే చేస్తున్నాయని అన్నారు. 35 ఏళ్ల నుంచి ఎంతో మంది నాయకులు, ముఖ్యమంత్రులను చూసాను, హైదరాబాద్ అంటేనే.. మత ఘర్షణలు వస్తాయి అని చెప్పుకునేవాళ్ళని అన్నారు. ఎన్టీఆర్  ముఖ్యమంత్రి అయ్యాక మత ఘర్షణలు తగ్గాయని, ఎన్టీఆర్ తర్వాత… కేసీఆర్ హయాంలోనే లా అండ్ ఆర్డర్ మెరుగ్గా ఉందని అన్నారు. మత ఘర్షణలకు తావు లేదని అన్నారు. హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతున్నారు అంటే.. కేసీఆర్ వల్లనేనని ఆయన అన్నారు.

ఒకప్పుడు తెలంగాణ అంటే.. నీళ్లు లేని రాష్ట్రం అని కానీ  ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లు ఉన్నాయిని ఆయన అన్నారు. ఫ్లైట్ లో వెళ్తుంటే పైనుంచి చూస్తే.. కింద అంతా పచ్చందనమే కనిపిస్తోందని అన్నారు. కేసీఆర్ కి ఆంధ్రా అంటే పడదు అనేవాళ్ళు. కానీ కొందరు ఆంధ్రా నాయకులపైనే ఆయన కోపమని అన్నారు. నీళ్లు నిధులు అడుక్కోవాలి వస్తుంది.. మన రాష్ట్రం మన కంటే బెటర్ అనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని ఆయన అన్నారు. ఆంధ్రా వాళ్ళను తరిమికొట్టాలి అనే ఉద్దేశం ఆయనకు లేదనుం ఆంధ్రా వాళ్ళను ఓటర్లుగా చూడకుండా.. తెలంగాణ వారితో సమానంగా చూసారని అన్నారు.