ఇండియా పోస్ట్: ఈ యాప్ లో స్పీడ్ పోస్ట్ చెయ్యచ్చు..!

-

పోస్ట్ ఆఫీస్ కొన్ని పనులని చేసుకోవడం మరెంత సులభం చేసింది. సేవలు పొందడానికి మీ సేవల్ని ట్రాక్ చేసేందుకు పోస్ట్‌ఇన్ఫో (post info) యాప్ బాగా ఉపయోగపడుతుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అఫీషియల్ యాప్ ఇది. ఇక దీనికోసం పూర్తిగా చూస్తే.. పోస్ట్‌ఇన్ఫో యాప్‌లో స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్, ఇన్స్యూర్డ్ లెటర్, వ్యాల్యూ పేయబుల్ లెటర్, ఇన్స్యూర్డ్ వ్యాల్యూ పేయబుల్ లెటర్, రిజిస్టర్డ్ ప్యాకెట్స్, రిజిస్టర్డ్ పీరియాడికల్స్, రిజిస్టర్డ్ పార్శిల్, ఇన్స్యూర్డ్ పార్శిల్, వ్యాల్యూ పేయబుల్ పార్శిల్, ఇన్స్యూర్డ్ వ్యాల్యూ పేయబుల్ పార్శిల్ మొదలైన ఆర్డర్స్ ట్రాక్ చేసుకోవచ్చు.

రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి లెటర్ లేదా పార్శిల్ ఎక్కడ ఉందో ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అలానే ఆర్డినరీ లెటర్, స్పీడ్ పోస్ట్ డొమెస్టిక్, రిజిస్టర్డ్ లెటర్, ఆర్డినరీ పార్శిల్, రిజిస్టర్డ్ పార్శిల్, రిజిస్టర్డ్ బుక్ ప్యాకెట్, ప్రింటెడ్ పుస్తకాలు ఇలానే వాటికీ ఎంత ఛార్జ్ పడుతుందో చూడచ్చు. పార్శిల్ పంపాలనుకునే ప్రాంతం ఎంత దూరంలో ఉంది అనే దాన్ని బట్టి ఛార్జీలు ఉంటాయి.

అయితే స్లాబ్స్ వున్నాయి. ఆ స్లాబ్ వివరాలు చూస్తే.. మొత్తం 5 శ్లాబ్స్ ఉంటాయి. లోకల్ పేరుతో మొదటి శ్లాబ్, 200 కిలోమీటర్ల వరకు రెండో శ్లాబ్, 201 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు మూడో శ్లాబ్, 1001 నుంచి 2000 కిలోమీటర్ల వరకు నాలుగో శ్లాబ్, 2000 కిలోమీటర్ల పైన ఐదో శ్లాబ్ ఉంటాయి. అదే విధంగా లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం చెల్లించాలి, ప్రభుత్వ పథకాల వివరాలు కూడా చూడచ్చు. ఇలా ఎన్నో వివరాలని ఈ యాప్ లో చూడచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news