ఈటలకు మరో షాక్.. టిఆర్ఎస్ లోకి కీలక నేత

ఈటల రాజేందర్ కు మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈటల రాజేందర్ అనుచరుడు, ఉద్యమ కారుడు పోచమల్లు టీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు..పోచమల్లును ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలకు ఈ రోజు తెరాస లోకి పోచమల్లు వచ్చాడని పేర్కొన్నారు. ఈ రోజు గెలిచేది న్యాయం, ధర్మమని.. ఈటల మాటలకు చేతలకు సంబంధం లేదని చురకలు అంటించారు.

రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పది అన్న ఈటల ఈరోజు మత్తతత్వ పార్టీలో చేరడని చురకలు అంటించారు. తల కిందికి కాళ్లు పైకి పెట్టిన ఈటల గెలవడని.. గెల్లు శ్రీను trsv నుండి 2001 నుండి పోరాడని స్పష్టం చేశారు. ఉస్మానియా లో ఉద్యమాన్ని ఉవెతున్న ఉరుకెచ్చిన వ్యక్తి గెల్లు శ్రీను అని పేర్కొన్నారు. ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తుల గెలుపు ఖాయమని.. ఈటల చెత్తిర్లు, గడియారాలు పంచినా గెలిచేది టిఆర్ఎస్ పార్టీనే అని వెల్లడించారు. హుజురాబాద్ అడ్డా టిఆర్ఎస్ అడ్డా అని స్పష్టం చేశారు.