ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని రాజీనామా

-

తాలిబన్ల కు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం లొంగిపోయింది. తాలిబాన్లకు తమ అధికారాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ అప్పగించింది. అంతేకాదు…ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని రాజీనామా చేశారు. అటు ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి స్పీకరు మరియు ఇతర మంత్రులు పాకిస్తాన్ కు పారిపోయారు. కాబూల్ పై దాడులు చేయవద్దని తాలిబన్లను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కోరింది. అయితే దీనిపై స్పందించిన తాలిబన్లు… తాము ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు ఎలాంటి హాని తలపెట్ట బోమని ప్రకటించారు.

ఆఫ్ఘనిస్తాన్ పౌరుల అంటే తమకు చాలా గౌరవమని.. వారికి ఎలాంటి హాని కలిగించ బోమని స్పష్టం చేశారు తాలిబన్లు. అంతేకాదు దాడులను నిలిపివేసి కాబూల్ సరిహద్దుల్లో తాలిబన్లు పాగా వేశారు. శాంతియుత చర్చల ద్వారానే కాబూల్ తమ ఆస్తి గతం అయిందని స్పష్టం చేశారు తాలిబన్లు. ఇక ఆఫ్గనిస్థాన్ దేశంలో సుమారు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని భారత్ దేశానికి తిరిగి రావాలని అడ్వైజరీ జారీ చేసింది విదేశాంగ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news