ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో రూ.59,400… ఎలా అంటే..?

-

ఎన్నో స్కీమ్స్ మనకి అందుబాటులో వున్నాయి. చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీమ్ వివరాలు చూడాల్సిందే. మరిక పూర్తి వివరాలను చూస్తే.. భార్యా భర్తలు ఇద్దరు ఈ స్కీమ్ లో కలిసి ఇన్వెస్ట్ చెయ్యచ్చు.

భార్యాభర్తలిద్దరి కోసం కూడా ఒక స్కీమ్‌ను ఇస్తోంది పోస్ట్ ఆఫీస్. ఇలా ఇందులో డబ్బులు పెడితే రూ.59,400 వరకు పొందొచ్చు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వలన చక్కటి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ స్కీమ్ తో నెలకు రూ.4950 వచ్చే అవకాశం వుంది. జాయింట్‌గా ఈ అకౌంట్ తెరవవచ్చు. జాయింట్ అకౌంట్ ద్వారా డబ్బులు డబుల్ అవుతాయి. ఈ స్కీమ్‌ లో కనీసం రూ.1000ను పెట్టుబడిగా పెట్టించచ్చు. సింగిల్ గా అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు.

లేదంటే ఇద్దరు కలిసి అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు. సింగిల్‌గా ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా నాలుగున్నర లక్షలు వస్తాయి. జాయింట్ గా కనుక ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో కనుక డబ్బులు పెడితే ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్ కింద ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఓపెన్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు నచ్చినప్పుడు అకౌంట్ ని జాయింట్ లేదా సింగల్ కింద మార్చుకోవచ్చు.

ఇక ఈ స్కీమ్ కింద ఎంత వడ్డీ వస్తుందనేది చూస్తే.. ఈ స్కీమ్ కింద 6.6 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. డిపాజిట్ల పై పొందిన వార్షిక వడ్డీరేటును ఆధారంగా వడ్డీని లెక్క పెడతారు. భార్యాభర్తలిద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.9 లక్షలను పెడితే రూ.9 లక్షలకి, 6.6 శాతం వడ్డీ రేటుని కలిపి సంవత్సరానికి రూ.59,400 వస్తాయి. దీన్ని పన్నెండు కింద డివైడ్ చేస్తే ప్రతినెలా రూ.4950 చేతికి వస్తాయి. అకౌంట్ ఓపెన్ చేసాక ఐదేళ్లలో ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news