చాలా మంది కి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ వుంది. నిజానికి పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల సేవలని ఇస్తోంది. వీటి వలన మనం ఎన్నో లాభాలని పొందేందుకు అవుతుంది. పైగా పోస్టాఫీస్ లో వుండే ఎన్నో స్కీమ్స్ మనకి ఉపయోగకరంగా ఉంటాయి. అలానే గ్రామీణ ప్రాంతాల వారు కూడా పోస్ట్ ఆఫీస్ అందించే సేవలని పొందుతూ వుంటారు. ఇంటికి ఒకటికి మించి పోస్టాఫీస్ అకౌంట్లు ఉంటాయి.
పోస్ట్ ఆఫీస్ లో మనం తక్కువ అమౌంట్ నుండి కూడా ఇన్వెస్ట్ చేసేయచ్చు. దీని వలన సుదీర్ఘ కాలంలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటే పక్కా ఇది తెలుసుకోవాలి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) సర్వీస్‌ను ఈ ఏడాదే తీసుకు వచ్చింది. ఇది పూర్తిగా కంప్యూటరైజ్డ్ సర్వీస్.
ఈ సర్వీస్ ని ఉపయోగించి మనం ఏ పథకం గురించైనా తెలుసుకోవచ్చు. సుకన్య సమృద్ధి మొదలు పీపీఎఫ్ ఇలా దేని కోసమైనా మనం తెలుసుకోవచ్చు. 1800 266 6868 టోల్ ఫ్రీ నెంబర్ ను ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చింది. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే కస్టమర్లు మీరు తెలుసుకోవాలని అనుకునే వివరాలు తెలుసుకోవచ్చు.
బ్యాలెన్స్ ని ఇలా ఈజీగా తెలుసుకోండి:
మీరు బ్యాలన్స్ ని చూడాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1800 266 6868 నంబర్‌కు కాల్ చెయ్యాలి.
ముందు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ని ఎంపిక చేసుకోవాల్సి వుంది.
ఆ తర్వాత మీ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేయడానికి 5ను నొక్కాలి.
మీ ఫోన్‌లో అకౌంట్ నెంబర్‌ను నమోదు చేసి # నొక్కడం ద్వారా బ్యాలెన్స్ ని చూడచ్చు.