వాటే స్కీమ్స్.. రూ.150 పొదుపుతో రూ.24 లక్షలు.. !

-

పోస్టాఫీస్ ఎన్ని రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాల ప్రయోజనాలు పొందొచ్చు. అదే విధంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కూడా వీటిలో ఒకటి. చిన్న మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందొచ్చు. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

స్కీమ్స్ / PPF

ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. అదే విధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. దీనిలో వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒక సారి మారొచ్చు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి 15 ఏళ్లు. 15 ఏళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. కావాలంటే మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు కూడా. ఇప్పుడు పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ వస్తోంది.

రోజుకు దీని కోసం రూ.150 ఆదా చేస్తే.. నెల చివరిలో రూ.4,500 మొత్తాన్ని పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసారంటే… సంవత్సరానికి రూ.54 వేలు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అవుతుంది. 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. అంటే రూ.10.8 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఇలా చేస్తే ఆఖరున రూ.24 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news