నాన్నకు ప్రేమతో ఈ ఫొటో.. చూసి తరించిపోండి!

-

నాన్న అంటే త్యాగం, ధైర్యం, జీవితం, భవిష్యత్తు, బాధ్యత, భరోసా, బహుమతి, ఆనందం, విజయం, స్నేహితుడు, గురువు.. ఇలా చెప్పుకుంటే పోతే పదాలు చాలవు. నాన్న అంటే అనంతం, అదే నాన్న గొప్పదనం. అమ్మ బిడ్డను నవమాసాలు మోసి ప్రాణం పోస్తే .. నాన్న జీవితాన్ని ఇస్తాడు. తాను కరిగిపోతూ ఇంటికి వెలుగునిస్తాడు. అంతటి మహోన్నతమైన వ్యక్తి తండ్రి. పైకి గంభీరంగా కనిపించినా మనసులో పిల్లలపై బోలెడంత ప్రేమ. పిల్లల కోసం పడితపిస్తారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తారు. అలాంటి నాన్నకు ఆ రోజు, ఈ రోజు అనేది ఏమీ ఉండదు. పిల్లలను చూస్తూ ప్రతి రోజూ పండగ చేసుకుంటారు. అలాంటి నాన్నకు ఇవాళ ఫాదర్స్ డే స్పెషల్ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫొటోపై కథనం.

కర్ణాటక జిల్లాలో ఓ జర్నలిస్ట్ తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారీ వర్ష పడుతుండగా కుమార్తె కమీలా రోడ్డు పక్కన ఆన్‌లైన్ క్లాస్‌కు హాజరయ్యారు. అయితే తండ్రి నారాయణ అమె పక్కన గొడుగు పట్టుకుని నిల్చున్నాడు. క్లాసుల అయ్యేంత వరకూ గొడుగు పట్టుకుని అలానే నిల్చున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుల్లియా తాలూకాలోని మారుమూల గ్రామమైన బల్లకాలో ఈ ఘటన జరిగింది.

కర్ణాటకలో రెండు, మూడు రోజులుగా భారీ వర్షాల పడుతున్నాయి. బల్లకా గ్రామంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఎస్ఎస్ఎల్‌సీ చదువుతున్న కమీలాకు ఆన్ లైన్ క్లాసుల్లో ఇబ్బంది కలిగింది. దీంతో గ్రామంలోని రోడ్డు పక్కన కూర్చుని ప్రతి రోజు ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా వర్షం పడింది. తండ్రి నారాయణ వెంటనే గొడుకు తీసుకుని వెళ్లి ఆన్ లైన్ క్లాసులు అయిపోయేంత వరకూ రక్షణగా నిలిచాడు. అటు వెళ్తున్న ఓ జర్నలిస్టు ఫొటో తీసి ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో వైరల్ కావడంతో స్థానిక బీఎస్ఎన్‌ఎల్ అధికారులు స్పందించారు. త్వరలోనే సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. బ్యాండ్‌విడ్త్ లేని ప్రాంతాల్లో భారత్ ఎయిర్‌ ఫైబర్ ఇంటర్నెట్‌ ద్వారా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇక కుమార్తెకు రక్షణగా నిలిచిన తండ్రి నారాయణపై ఫాదర్స్ డే సందర్బంగా అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news