పోస్టల్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారా..? బ్యాలెన్స్ ని ఇలా చెక్ చేసుకోండి..!

-

పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో పథకాలు వున్నాయి. చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. మీరు కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారా..? పోస్ట్ ఆఫీస్ లో డబ్బులని చూసుకోవాలి..? అయితే ఇలా బ్యాలెన్స్ ని ఈజీగా చెక్ చేసుకోండి.

అయితే గతం లో పోస్ట్ ఆఫీస్ లో బ్యాలెన్స్ ని చూడడానికి బ్యాంక్ కి కానీ పోస్ట్ ఆఫీస్ కి కానీ వెళ్లాల్సి వచ్చేది. లేదంటే బ్యాలెన్స్ ని చెక్ చేసేందుకు అవ్వదు. కాని పోస్టాఫీసులు ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను తీసుకు రావడం వలన పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ కస్టమర్‌లు తమ ఖాతా సమాచారాన్ని ఈజీగా చూడచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ అవసరం కూడా ఉండక్కర్లేదు. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఈ-పాస్‌బుక్ ఫెసిలిటీ ని తీసుకు వచ్చారు.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌ ని మీరు ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి వాడచ్చు. సుకన్య సమృద్ధిఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉంటే మినీ స్టేట్‌మెంట్‌లు పొందొచ్చు. ఈ స్కీమ్స్ కి మాత్రమే కాకుండా మిగిలిన పథకాలకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉండనున్నాయి. www.indiapost.gov.in లేదా www.ippbonline.com కి వెళ్లి మీరు బ్యాలెన్స్ చెక్ చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news