అలాంటి పని చేయలేక క్యారవాన్ లోకి వెళ్లి ఏడ్చేశా.. అంజలి..!!

-

ప్రముఖ తెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది . అడపా దడపా స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ అలరిస్తున్న ఈ అమ్మడు తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పలు సినిమాలలో కూడా కీలకపాత్రలో నటిస్తున్న అంజలి తాజాగా సంచలన కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న #RC15 అనేవర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది . ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి మాట్లాడుతూ.. కొన్నిసార్లు రొమాంటిక్ సీన్స్ లో నటించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సినిమా కోసం అలాంటివి చేయడం తప్పదు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడేదాన్ని.. కొన్ని సినిమాలలో పాత్రకు తగ్గట్టు ముద్దు సీన్లలో కూడా నటించాల్సి వస్తుంది. ముఖ్యంగా మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఇబ్బంది అని తెలిపింది.

ఇంటిమేట్ సీన్లలో నటించినప్పుడు తట్టుకోలేక క్యారవాన్ లోకి వెళ్లి కూడా ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. అయినా కూడా సినిమాలో సీన్ కోసం నటించాల్సి వస్తుంది అని చెబుతూ ఎమోషనల్ అవుతోంది అంజలి. ప్రస్తుతం అంజలి సెట్స్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మీడియాతో వెల్లడించి మరింత ఎమోషనల్ అవుతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news