భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండకూడదని చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. దీని వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది రాదు. అయితే కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అలానే పోస్టాఫీసులలో కూడా రకరకాల పథకాలు ఉన్నాయి.
ఈ పథకాలలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రాబడి వస్తుంది. ఏ రిస్క్ ఉండదు కచ్చితమైన రాబడి వస్తుంది. అయితే పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాల లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) కూడా ఒకటి. ఇక మరి ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం. పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో 7 శాతం వడ్డీ వస్తుంది.
ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ లో కనీసం రూ. 1000 పెట్టుబడి పెడితే సరిపోతుంది. లిమిట్ అంటూ ఏమి లేదు. ఎంతైనా ఇందులో పెట్టచ్చు. ఇందులో ముగ్గురు పెద్దలతో ఉమ్మడి ఖాతాను కూడా ఓపెన్ చెయ్యచ్చు. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ మైనర్ అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.
ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొత్తం మెచ్యూర్ అవుతుంది. సెక్షన్ 80C కింద మినహాయింపు కూడా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని ఈ సెక్షన్ కింద రూ. 1.5 లక్షల వరకు ఉన్న మొత్తంపై ట్యాక్స్ బెనిఫిట్ ని పొందవచ్చు.