న్యూఢిల్లీ: కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐసీఎస్ఈ) నిర్వహించబోయే పరీక్షలను వాయిదా వేసింది. 10, 12 తరగతులకు సంబంధించిన కొన్ని సబ్జెక్టుల పరీక్షల తేదీలను మారుస్తూ సోమవారం నివేదిక వెలువరించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 10వ తరగతి పరీక్షలు మే 13, 15 తేదీలల్లో నిర్వహించబోమని సీఐసీఎస్ఈ పేర్కొంది. విద్యార్థులు వాయిదా పడిన పరీక్షల వివరాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
ఈ పరీక్షల తేదీల్లో మార్పులు..
సీఐసీఎస్ నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల్లో మార్పులు తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మే 13వ తేదీన జరగాల్సిన (ఎకనామిక్స్ గ్రూప్-2 ఎలెక్టివ్) పరీక్షా మే 4వ తేదీన జరుగుతుందని, అలాగే మే 15వ తేదీన జరగాల్సిన ఆర్ట్ పేపర్-2 (నేచర్ డ్రాయింగ్, పెయింటింగ్) పరీ మే 22వ తేదీన జరగుతుందని అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఆర్ట్ పేపర్-3 (ఒరిజినల్ కంపోజిట్), ఆర్ట్ పేపర్-4 (అప్లైడ్ ఆర్ట్) పరీక్షలు జూన్ 5, 29 తేదీల్లో నిర్వహించనున్నారు.
జూన్ 16 వరకు పరీక్షలు..
ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (ఐఎస్‌సీ) సవరించిన టైమ్ టేబుల్ ప్రకారం.. 12వ తరగతి పరీక్షలు మే 13, 15వ తేదీల్లో, జూన్ 12వ తేదీన పరీక్షలు నిర్వహించబడదు. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగే 10వ తరగతి పరీక్షలు మే 5వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు జరుగుతాయని సీఐసీఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ జెర్రీ అరథూన్ పేర్కొన్నారు. అలాగే ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఆధ్వర్యంలో జరిగే 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షా ఫలితాలు జూలై నాటికి ఆయా పాఠశాలల అధిపతులు విడుదల చేస్తారన్నారు.