కోల్‌కత్తా అగ్నిప్రమాదం జరగడంతో తొమ్మిది మంది మృతి చెందారు. లిఫ్ట్‌లో చిక్కుకుపోయి ఐదుగురు మృతి చెందడం బాధాకరం. మృతుల్లో నలుగురు ఫైర్ సిబ్బంది, ఒక పోలీసు అధికారి, ఒక ఆర్.పి.ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. కలకత్తా న్యూ కోయిలా ఘాట్ భవనం 13వ అంతస్థులో మంటలు చెలరేగాయి. ఈస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వే కార్యాలయాలకు నెలవైన భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సాయంత్రం గం. 6.30 సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొన్న నేపథ్యంలో రంగంలోకి 25 ఫైరింజన్లు దిగి మంటలార్పగా చివరికి అదుపులోకి వచ్చాయి.
ప్రమాద సమయంలో లిఫ్ట్ ఉపయోగించడంతో మృతుల సంఖ్య పెరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లిఫ్ట్ ఆగి, దట్టమైన పొగతో ఊపిరాడక అందులో చిక్కుకుపోయిన ఐదుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అగ్నిప్రమాదం కారణంగా ఐఆర్సిటిసి సర్వర్ దగ్ధమైంది, దీంతో ఆన్ లైన్ టికెట్ బుకింగ్‌పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.