మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. “గని” మూవీ విడుదల వాయిదా..

-

మెగా ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్లు… మొదట ఈ సినిమా బృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు.. ప్రకటించింది గని సినిమా బృందం. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా వదిలింది ఈ చిత్ర బృందం.

త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని కూడా ప్రకటించింది చిత్రబృందం. దీంతో మెగా ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. కాగా..వరుణ్ తేజ్… ప్రస్తుతం గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news