ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది విద్యుత్ శాఖ. నేటి నుంచి ఏపీలో మరిన్ని గంటలు కరెంట్ కోతలు ఉండనున్నాయి. నిన్నటి కంటే ఇవాళ్టి నుంచి ఆరగంట నుంచి గంట వరకు కరెంట్ కోతలు ఎక్కువగా ఉండనున్నాయి. ఇందులో భాగంగానే… తిరుపతి జిల్లా ఎస్పిడిసియల్ ఫరిధిలో అధికారికంగా కరెంట్ కోతలు షూరు అయ్యాయి.
నాయుడుపేట,గూడూరు ,నెల్లూరు రూరల్లో ప్రాంతాలలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, ఆత్మకూరు,కావలి, పులివెందుల,కడప లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మదనపల్లి ,తిరుపతి ,తిరుపతి రూరల్ లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కరెంట్ కోతలు ఉండనున్నాయి.
పీలేరు,చిత్తూరు రూరల్ ,కుప్పంలో ఉదయం 11 నుంచి 12గంటల వరకు, పుత్తూరు,చిత్తూరులో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు, రాజంపేట ,రాయచోటి,మైదుకూరు,ప్రొద్దుటూరు లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు, కళ్యాణదుర్గం, గుత్తి ,అనంతపూర్ లో మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉండనున్నాయి. కదిరి ,హిందూపూర్,అనంతపూర్ రూరల్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఆదోని ,కర్నూలు రూరల్ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నంద్యాల ,డోన్ ,కర్నూల్ లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కరెంట్ కోతలు ఉండనున్నాయి.