ప్రభాస్..బాలయ్య కోసం ఇన్ని వంటకాలు చేయించారా..?

-

స్టార్ హీరో ప్రభాస్ ఎంత గొప్పవారో అందరికీ తెలిసిందే.. తండ్రి చనిపోయినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. ప్రజల ఆకలి తీర్చిన గొప్ప రాజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ తనతో ఉండే వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కువ మొత్తం ఆర్థిక సహాయం ప్రకటించేది కూడా ఈయనే.. ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్న ఫలితాన్ని అందుకోకపోయినా ఈయన మార్కెట్ మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కి గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా హాజరయ్యారు ప్రభాస్.

ఈ క్రమంలోనే తాజాగా సెట్ మొత్తానికి విందు భోజనం ఏర్పాటు చేయించారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇకపోతే బాలయ్య కోసం ప్రభాస్ చేయించిన వంటకాల జాబితా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు రాజు ఎక్కడున్నా రాజే అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలయ్యకు ఇష్టమైన వంటకాల వివరాలను తెలుసుకొని మరీ ఆ వంటకాలను ప్రభాస్ ప్రత్యేకంగా తయారు చేయించారట . ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు.

ప్రభాస్ చేయించిన వంటకాల జాబితాలో మటన్ బిర్యానీ, పీతల ఇగురు , చేపల పులుసు, మటన్ కర్రీ, చికెన్ ఇతర వంటకాలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలతో పాటు పప్పు, సాంబార్, ఆవకాయ లాంటి టేస్టీ వెజ్ ఐటమ్స్ ని కూడా ప్రభాస్ ప్రత్యేకంగా చేయించి మరీ తీసుకొచ్చారని సమాచారం. మొత్తానికి ప్రభాస్ ఆతిథ్యాన్ని బాలయ్య కూడా స్వీకరించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news