షాక్: ప్రభాస్ ఘాటైన రొమాంటిక్ సీన్స్ లో..!!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా కుళ్ళు కుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రోజెక్ట్ కె, స్పిరిట్ ఇలా ఉంది మనోడి సినిమాల జాబితా. ఇవన్ని 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు ఉన్నాయంటే మనోడి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇది ఎవరికి సాధ్యం కాని రికార్డ్ అందుకే సూపర్ స్టార్ గా ఉన్నాడు. వీటి అన్నింటి మధ్యలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.హారర్ కామెడీ నేపథ్యంతో సాగే స్టోరీ ఇది. ఒక థియేటర్ చూట్టూ తిరిగే కథ. ఇక అచ్చమైన తెలుగు సినిమా డైరెక్టర్ ఈ సినిమా తీస్తుండడం తో ఇందులో తెలుగు ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అంశాలు ఉంటాయని అంటున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో డార్లింగ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అనే విషయం తెలిసిందే.. ఈ ముగ్గురిలో మాళవిక మోహనన్ ఒకరు.. తాజాగా మారుతి కొత్త షెడ్యూల్ కి టీమ్ మొత్తాన్ని రెడీ చేస్తున్నారట.. ఈ షెడ్యూల్ లో మాళవిక మోహన్ మధ్య కీలక ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అసలే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుండో రొమాన్స్ లేదని బాధ పడుతున్నారు, ఇన్నాళ్లకు వారి బాధ తీరుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news