ప్రభుత్వ సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

ఏపీలో ప్రభుత్వ సలహాదారుల నియామకం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రంగా ఫైర్ అయింది. ఇలాగే వదిలేస్తే తహశీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారేమోనని వ్యాఖ్యానించింది. దేవాదాయశాఖతో పాటు వివిధ శాఖల్లో ప్రభుత్వ సలహాదారులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఐఏఎస్‌ అధికారులు ఉండగా వివిధశాఖలకు సలహాదారులు ఎందుకని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి సంబంధించి రాజ్యాంగబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ సలహదారులకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో దేవాదాయశాఖ సలహాదారుగా శ్రీకాంత్‌ ను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. స్టే ఉత్తర్వుల్లో  సవరణ చేసి ఆయన సలహదారు పదవిలో కొనసాగేందుకు అనుమతిచ్చింది. సలహదారుల నియామకంపై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news