‘సలార్‌’ సెట్‌లో ప్రభాస్.. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట కొద్దిరోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు దశదిశ కర్మలు పూర్తయ్యాక.. ఆయన సినిమా షూటింగ్ లు పునఃప్రారంభించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. తనని నమ్ముకున్న దర్శకనిర్మాతల కోసం తిరిగి సెట్ లోకి అడుగుపెట్టారు ప్రభాస్. ‘సలార్‌’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. సాహో, రాధేశ్యామ్ నిరాశ కలిగించడంతో రెబల్ స్టార్స్ ఫ్యాన్స్ అంతా తదుపరి వచ్చే సలార్ పైనే తమ ఆశలు పెట్టుకున్నారు.

హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో తాజాగా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ కోసమే ఇప్పటికే అక్కడ 12 ప్రత్యేక సెట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు వీటిలోనే ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి సంగీతం: రవి బసూర్‌, ఛాయాగ్రహణం: భువన గౌడ్‌.

Read more RELATED
Recommended to you

Latest news