బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆమెకే అవకాశం..

బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాలేని ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. ముందుగా మళయాలీ భామని తీసుకున్నప్పటికీ, టెస్ట్ షూట్ చేసిన తర్వాత సెట్ కావట్లేదని ఆమెని పక్కకి తప్పించారు.

ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేని ప్రగ్యాకి బాలయ్య సినిమాలో రావడం అదృష్టమే. మరి కంచె సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న అమ్మడు, బాలయ్య సినిమాతో హిట్ అందుకుని అవకాశాలు తెచ్చుకుంటుందేమో చూడాలి.