జన్ సురాజ్ అభియాన్ ద్వారా బీహార్‌లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని నెరవేరిస్తే.. తన జన్ సురాజ్ అభియాన్ క్యాంపెయిన్‌ను ఆపేస్తానని పేర్కొన్నారు. అలాగే నితీష్ ప్రభుత్వానికి తన పూర్తి మద్దతును ప్రకటిస్తానని పేర్కొన్నారు.
సమస్తిపూర్‌లో తన మద్దతుదారులతో భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్. మహాగట్ బంధన్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో ఆదరణ లేదని పేర్కొన్నారు. సీఎం కుర్చీకి నితీష్ కుమార్ ఫెవికాల్ అంటించుకుని కూర్చున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇఛ్చిరు. ఇప్పటికీ ఆ హామీలు నెరవేర్చలేదు. రెండేళ్ల సమయంలో ఆ హామీని నెరవేరిస్తే తాను జన్ సురాజ్ అభియాన్‌ను ఆపేస్తానని ప్రశాంత్ కిశోర్ ఈ సందర్భంగా తెలియజేశాడు.