ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు ఇప్పటివరకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్ రూటు మార్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐపాక్ టీమ్ 2019ఎన్నికల్లో జగన్ పార్టీ భారీ విజయం వెనుక కీ రోల్ ప్లే చేసింది. నిన్నమొన్నటివరకు కూడా జగన్‌తోనే ఐపాక్ టీమ్ ఉంది. అయితే తాజాగా టీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో ప్రశాంత్ కిశోర్ కనిపించడం కాక రేపుతోంది.
గన్నవరం విమానాశ్రయం లో ప్రత్యేక విమానంలో లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్‌తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ సింఘ్ ఉన్నారు. అయితే ఇప్పటివరకు అటు ఐపాక్ కానీ.. ఇటు రాబిన్ సింఘ్ టీమ్ కానీ ప్రశాంత్ కిశోర్ విషయం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినతే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఒకే వాహనంలో కలిసి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా పీకే వ్యవహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పీకే వైసీపీ వ్యూహకర్తగా పని చేశారు.