జీవో 46 రద్దు చేయండి.. పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు డిమాండ్

-

గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జీవో నెంబర్ 46 వెంటనే రద్దు చేయాలని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు ఈ నిరసనకు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ అభ్యర్థులు మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్లో గత ప్రభుత్వం తెచ్చిన జీవో 46 వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకే అధికమేలు జరుగుతుందని గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు న్యాయం జరగదని మెరిట్ లో మార్కులు తెచ్చుకున్న ఈ జీవో వల్ల ఉద్యోగాలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత పద్ధతి ప్రకారం నియామక ప్ర క్రియా చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్లో జీవో నెంబర్ 46 నుంచి పోస్టు కోడ్ నెంబర్ 24 టి ఎస్ ఎస్ పి 5000 పోస్టులు మినహాయించాలని కానిస్టేబుల్ విద్యార్థుల పోరాట సమితి ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులకు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. జీవో నెంబర్ 46 గురించి తల్లిదండ్రులు విద్యార్థులు తెలుసుకోకపోతే భవిష్యత్ తరాలు చాలా నష్టపోతాయని కానిస్టేబుల్ పోరాట సమితి తాజాగా ఓ లేక విడుదల చేసింది. 2014, 2016, 2018 పోలీస్ రిక్రూట్మెంట్లో b పోస్ట్ కోడ్ నెంబర్ 24 టి ఎస్ ఎస్ పి అనే స్టేట్ పోస్టును 2022 నోటిఫికేషన్ లో జిల్లా పోస్ట్గా మార్చి మెరిట్ సాధించిన చాలామంది అభ్యర్థులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news