జమిలికి షరతులతో కూడిన మద్దతు ఇస్తా : ప్రశాంత్‌ కిషోర్‌

-

దేశంలో ఏ రాజకీయ నాయకుడు కదిలించిన జమిలి ఎన్నికల అంశంపై స్పందిస్తున్నారు. అయితే.. తాజాగా జమిలి ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షరతులతో కూడిన మద్దతును ఇస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం సరైన ఉద్దేశ్యంతో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అంగీకరిస్తామన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక వల్ల ఖర్చులు తగ్గిస్తాయని, ఓటర్లకు కూడా ఇబ్బందులు తగ్గవచ్చునన్నారు. భారత్ వంటి పెద్ద దేశాల్లో ఏడాదికి 25 శాతం మంది ఎన్నికల్లో ఓటు వేస్తుంటారని, జమిలి తీసుకువస్తే ఒకటి రెండుసార్లకే పరిమితమవుతుందని, ఇది ప్రయోజనకరమే అన్నారు.

రాత్రికి రాత్రే 2024లోనే జమిలి తీసుకువస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. సరైన ఉద్ధేశ్యం ఉంటే నాలుగు నుండి ఐదు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ఇది అసాధ్యమైతే గతంలో 17, 18 సంవత్సరాల పాటు ఎలా అమలు చేశారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది పావు వంతు ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం వల్ల ఎప్పుడూ ఎన్నికల వలయంలో చిక్కుకోవడం అవుతోందని, జమిలి ద్వారా ఇది ఒకటి రెండుసార్లకు పరిమితమైతే మంచిదే అన్నారు. జమిలి ద్వారా ప్రజలు ఒకేసారి నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రభుత్వం బిల్లును తీసుకు వస్తోందని, అది వచ్చాక చూడాలని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాలన్నారు. ఇది దేశానికి మంచిదే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news