ఏపీ సీఎం జగన్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం సంచలనంగా మారింది. ఈరోజు తాడేపల్లి లోని క్లాంప్ కార్యాలయంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారని అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైకాపాకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందం పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన సైలెంట్ అయ్యారు. కానీ ఆయన టీం మాత్రం జగన్ కోసం పని చేస్తూనే ఉంది.
అయితే ఇప్పుడు జగన్ ఆయన్ను పిలిపించటం వెనుక కారణం ఏమై ఉంటుందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల నేపధ్యంలోనే ఈ కలయిక జరిగి ఉండవచ్చు అనే వాదన కూడా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మత రాజకీయాలు ఏపీలో పెరిగిపోవడంఆలయాలపై దాడులు ఆగకపోవడం ప్రభుత్వానికి కంటకంగా మారింది. ఇదే విషయం మీద ఈయనను పిలిపించి ఉంటారనే వాదన కూడా ఉంది.