పేపర్ లీక్ సమాచారం ఇచ్చింది బండి సంజయ్ అనుచరుడే.. : మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

ఒకవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పైన బీజేపీ నాయకులు మాటల దాడి చేస్తుంటే… ఇటు అధికార పార్టీ BRS నుండి ప్రజాప్రతినిధులు డిపెండ్ చేసుకుంటున్నారు. తాజాగా బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి తన ఆగ్రహాన్ని చూపించారు. బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారని… వీరే పేపర్ లను మీడియాకు లీక్ చేసి మరియు అందరికీ షేర్ చేసి సమస్యను సృష్టించి , మళ్ళీ మా ప్రభుత్వంపైనే బురదచల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారి తీరును ఎండగట్టారు. అస్సలు పేపర్ ను లీక్ సమాచారాన్ని ఇచ్చింది బండి సంజయ్ అనుచరుడేనని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని చెడుగా చిత్రీకరించి లబ్ది పొందాలన్న ప్లాన్ లో ఉన్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అసలు ఇంతకీ బండి సంజయు ను అరెస్ట్ చేసిందిస్ సరైన కారణం మీదేనా ? లేదా ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news