IPL 2023 : గిల్ క్లీన్​ బౌల్డ్​.. ప్రీతి జింటా రియాక్షన్​ చూశారా..?

-

IPL 2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ వరుసగా రెండోసారి ఓటమిపాలైంది. గురువారం రోజున గుజరాత్‌ టైటాన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ధావన్ సేన ఓటమి పాలైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ నాలుగు వికెట్ల నష్టానికి మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

గుజరాత్‌ బ్యాటర్లలో శుభ్​మన్‌ గిల్‌(67) హాఫ్​ సెంచరీతో మెరిశాడు. గుజరాత్‌ టైటాన్స్ విజయానికి చివరి ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా.. ధావన్‌.. సామ్‌ కరన్​ చేతికి బంతిని ఇచ్చాడు. ఫస్ట్​ బాల్​కు మిల్లర్‌ సింగిల్‌ తీసి గిల్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు.

అయితే ఆ తర్వాత కరన్​ వేసిన అద్భుతమైన బౌలింగ్​కు గిల్‌ క్లీన్‌ బౌల్డ్​ అయ్యాడు. దీంతో ఒక్క సారిగా పంజాబ్‌ ఫ్యాన్స్​ సంబరాల్లో మునిగి తేలిపోయారు. పంజాబ్​ డగౌట్‌ కూడా మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా స్టాండ్స్​లో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తున్న పంజాబ్‌ కో ఓనర్​, బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ ప్రీతి జింటా అనందానికి అవధులు లేకుండా పోయాయి.

గిల్‌ ఔట్​ అయిన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ యాక్టర్స్​ అర్బాజ్ ఖాన్, సోనూ సూద్‌లతో కలిసి సెలబ్రేషన్స్‌ చేసుకుంది. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తమ జట్టును ఎంకరేజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ ​మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. ఇందులో ప్రీతి రియాక్షన్​ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news