గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన పద్ధతులని అనుసరించి బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే 9 నెలలు నిజానికి గర్భిణీలు చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం రోజుకోలా ఉంటుంది.
ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేరు. అయితే చాలా మంది నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. అప్పుడు కచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది.
మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం:
గర్భిణీలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ తియ్యటిఆహార పదార్థాలను కానీ కారంగా ఉండే ఆహార పదార్థాలను కానీ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను తీసుకొద్దు. చాక్లెట్స్, పిజ్జా వంటి వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీటికి బదులుగా మీరు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.
పనులు చేసుకోవడం:
అలాగే చాలా మంది గర్భిణీలు 9 నెలలు కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం చాలా మంచిది. గర్భిణీలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత యాక్టివ్ గా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ బరువులు ఎత్తడం వంటివి చేయడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి.
పాజిటివ్ గా ఉండడం:
ఒత్తిడి లేకుండా ఉండడం, పాజిటివ్ ఆలోచనలతో ఉండడం, మంచి పుస్తకాలను చదవడం, మ్యూజిక్ వినడం వంటివి చేయడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. కనుక ఈ విధంగా గర్భిణీలు తొమ్మిది నెలల ఫాలో అయితే కచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సు ఉంటాయి.