ఢిల్లీలో దోస్తి… ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీయేనా. టీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ నేత మానిక్కం ఠాగూర్ సెటైర్

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్క ఠాగూర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై  మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ శిక్షణా శిబిరాలకు అనుమతి కోరితే తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదని.. జనవరి 9 నుంచి 11 దాకా జరిపే శిక్షణా శిబిరాలకు అనుమతించని… ప్రభుత్వం సంఘ్ కార్యక్రమాలకు ఎలా అనుమతించిందని ప్రశ్నించారు. 120 మందితో శిక్షణా శిబిరానికి అనుమతించలేదు… కానీ 300 కన్నా ఎక్కువ మంది సంఘ్ కార్యకర్తల సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ ద్వంద్వ విధానాలని మానిక్కం ఠాగూర్ విమర్శించారు. ఢిల్లీలో దోస్తీ.. ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీనేనా అని బీజేపీ, టీఆర్ఎస్ లపై సెటైర్ వేశారు మానిక్కం ఠాగూర్. ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఇటీవల ఆర్ఎస్ఎస్ సంఘ్ కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికైంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వకుండా… బీజేపీ కార్యక్రమాలకు పర్మిషన్ ఇస్తున్నారనే ఉద్దేశంలో ట్విట్ చేశారు. గతంలో ఢిల్లీ దోస్తీ… గల్లీలో కుస్తీ అనేదాన్ని ప్రస్తుతం గల్లీలో కూడా దోస్తీనేనా అని వ్యంగ్యంగా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news