తెలంగాణలో పత్తి క్వింటాల్‌ రూ. 10 వేలు : మంత్రి నిరంజన్‌

-

తెలంగాణలో పత్తి క్వింటాల్‌ రూ. 10 వేలు నడుస్తుందంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రకటన చేశారు. ఆలేరులో రైతు బంధు వారోత్సవాలల్లో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… పల్లెపల్లెనా రైతుబంధు విజయోత్సవాలు ఘనంగా సాగుతున్నాయని… వ్యవసాయం నాడు – నేడు అని చిన్నారులు వ్యాసరచనలు, చిత్రలేఖన పోటీలతో వ్యవసాయరంగ గొప్పదనాన్ని చాటి చెబుతున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతుల మోహము లో చిరునవ్వులు పూస్తున్నాయి, మార్కెట్‌లో పత్తి క్వింటా రూ.9 నుండి రూ.10 వేలు ధర పలుకుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది, రైతులు పత్తి సాగుకు మొగ్గుచూపాలని… ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలలో వేయడం అపూర్వమైన విజయమన్నారు. వ్యవసాయరంగంతో పాటు అన్ని రంగాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి సీఎం కేసీఆర్ ఉపాధి అవకాశాలు పెంచుతున్నారని పేర్కొన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news