నమ్మించి మోసం చేశాడంటూ త్రివిక్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రేమ..!

-

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రేమ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ధర్మచక్రం సినిమాతో తెలుగు పరిచయమైన ప్రేమ.. అతి తక్కువ కాలంలోనే మావిడ కలెక్టర్, కోరుకున్న ప్రియుడు వంటి సినిమాలలో నటించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలను దక్కించుకోలేదు. ఇక తాను స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో సహాయనటిగా ఎందుకు మారాల్సి వచ్చిందో అని తెలుపుతూనే త్రివిక్రమ్ తనను నమ్మించి మోసం చేశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను హీరోయిన్ గా ఉన్న సమయంలోనే చిరునవ్వుతో సినిమాతో సహాయక పాత్రలో ఎందుకు నటించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చిన ప్రేమ.. ఈ సినిమా వల్లే తన ఇమేజ్ డామేజ్ అయిందని కూడా తెలిపింది.. ప్రేమ మాట్లాడుతూ.. నేను అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్నాను. మొదట త్రివిక్రమ్ చిరునవ్వుతో సినిమాలో నాది హీరోయిన్ పాత్రని చెప్పారు. అయితే ఇందులో మరో హీరోయిన్ ఉందా అని అడిగాను. నీది కూడా హీరోయిన్ రేంజ్ పాత్రని చెప్పి త్రివిక్రమ్ నన్ను ఒప్పించాడు . కథ మొత్తం నా చుట్టూనే ఉంటుందని చెప్పడంతో త్రివిక్రమ్ మీద నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా క్యారెక్టర్ అంతా సహాయ నటి పాత్రగా మారిపోయింది. షూటింగ్ కి ముందు ఒకలా చెప్పి.. సినిమాలో నన్ను ఇంకోలా చిత్రీకరించి త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు.

Trivikram Srinivas - Wikipedia

ఇక ఆ తర్వాత అన్ని క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలే వచ్చాయి. అలా త్రివిక్రమ్ మోసం చేయడంతో నా కెరియర్ నాశనమైంది ” అంటూ ప్రేమ చెప్పుకొచ్చింది . ప్రస్తుతం ప్రేమ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news