బ్రేకింగ్ : వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

-

వ్యవసాయ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల మూడు కొత్త బిల్లులను తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిని పార్లమెంటులో వాటిని ఆమోదింపజేసుకుంది. తాజాగా ఈ బిల్లులకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇవి చట్టాలుగా మారాయి. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, బీహార్ వంటి రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా చేపట్టారు.

CAPTION- Farmers block Beas bridge during protest against the three agriculture ordinances introduced by the Center at Beas on Monday, September 14 2020. EXPRESS PHOTO BY RANA SIMRANJIT SINGH

ఈ బిల్లులు రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొన్ని విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కొత్త బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు నిన్న ‘భారత్ బంద్’‌ కూడా చేశాయి. ఎలా అయితేనేమి ఎట్టకేలకు రాష్ట్రపతి వీటికి రాజముద్ర వేయడంతో ఇక ఇవి చట్టాలు గా మారిపోయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news