వాహనదారులకు షాక్‌..ఇవాళ కూడా పెరిగిన పెట్రోల్‌ ధరలు

-

ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వాటి ధరలు చూస్తే… సామాన్యుడి గుండె బరువెక్కుతోంది. మొన్నటి ఐదు రాష్ట్రాల ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తి కాగానే.. ధరలు డబుల్‌ చేసేస్తుంది. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా.. రోజుకు 90 పైసలు కచ్చితంగా పెంచుతున్నారు. అయితే… ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి పోయాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, లీటర్‌ డీజిల్‌ పై 80 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.41 కు చేరగా డీజిల్ ధర రూ. 94.67 కు పెరిగింది. ముంబై లో లీటర్‌ పెట్రోల్‌, లీటర్‌ డీజిల్‌ పై 85 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 118.41 , కు చేరగా డీజిల్ ధర రూ. 102.64 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 116. 33 కు చేరగా డీజిల్ ధర రూ. 102. 45 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119. 01 కు చేరగా డీజిల్ ధర రూ. 104. 70 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news