బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్.. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో శ్రుతిహాసన్..

-

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ సినీ కెరీర్ టాలీవుడ్ సినిమాతోనే ఒరిజినల్ గా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఆమె సినీ జీవితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం ముందు, తర్వాత అని పేర్కొంటారు సినీ పరిశీలకులు.

ఈ ఫిల్మ్ తర్వాత శ్రుతి హీరోయిన్ గా నిలదొక్కుకుంది. వరుసగా అవకాశాలు ఆమె తలపు తట్టగా వాటిని సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రజెంట్ ఈ భామ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

కొంత కాలం పాటు తెలుగు పిక్చర్స్ కు దూరంగా ఉన్న ఈ భామ గతేడాది రీ ఎంట్రీ ఇచ్చింది. వరుస హిట్స్ అందుకుని దూసుకుపోతున్నది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ సినిమాల్లో ఈ భామ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ సుందరి.. టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాలోనూ నటిస్తోంది.

నందమూరి నటసింహం బాలయ్య ‘ఎన్ బీ కే 107’ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘మెగా 154’ మూవీ, ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మొత్తంగా ఈ అమ్మడు తెలుగు చిత్ర సీమపైన ఫుల్ ఫోకస్ చేసిందన్నట్లు అయిపోయింది.

నెట్ ఫ్లిక్స్ తొలి తొలుగు ఒరిజినల్ ‘పిట్ట కథలు’లో నటించిన శ్రుతి.. తర్వాత తమిళ్, హిందీ భాషల్లో నటించాలనుకున్నట్లుంది. కానీ, ఈ సుందరికి తెలుగు చిత్ర సీమ నుంచి అవకాశాలు వరుసగా వచ్చాయి. అలా ఈ భామ ప్రజెంట్ ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news