వ్యాక్సిన్ వస్తుంది… మీరు రెడీ అవ్వండి: సిఎంలకు మోడీ ఆదేశాలు

-

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. దేశంలో ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితిపై ఆయన సిఎంలతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కరోనావైరస్ కేసులు పెరగడాన్ని ప్రస్తావిస్తూ… భారత్ మెరుగైన పరిస్థితిలో ఉందని సమావేశం అనంతరం ప్రధాని మోదీ అన్నారు. “ఉమ్మడి ప్రయత్నాల ఫలితంగా, రికవరీ మరియు మరణాల రేటు విషయానికి వస్తే నేడు భారతదేశం ఇతర దేశాల కంటే మెరుగైన పరిస్థితిలో ఉంది” అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

వ్యాక్సిన్ ఎంత వేగంగా అందించాలో అంతే వేగంగా మనం ఏర్పాట్లు కూడా చేసుకోవాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ వ్యూహం రాష్ట్రాలతో సమిష్టి సమన్వయంతో ఉంటుందని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను కూడా రాష్ట్రాలు ప్రారంభించాలని ఆయన సూచించారు. పలువురు సిఎంల అభిప్రాయాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. పాజిటివిటీ రేటును 5 శాతం కన్నా తక్కువకు, మరణాల రేటును 1 శాతం లోపు తీసుకురావడానికి పని చేయాలని ప్రధాని సిఎంలను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news