ప్రధాన్ మంత్రి స్వస్త్య సురక్ష యోజన స్కీమ్ గురించి విన్నారా..? స్కీమ్ తో ఎన్ని లాభాలంటే..?

-

కేంద్రం ప్రజల కోసం ఎన్నో తీసుకు వచ్చింది. అయితే వీటి వలన చాలా ప్రయోజనాలు వున్నాయి. దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతలో ప్రాంతీయ అసమతుల్యతను సరిదిద్దడం కోసం మరియు మంచి వైద్య విద్య కోసం సౌకర్యాలను అందించడం కోసం ప్రధాన్ మంత్రి స్వస్త్య సురక్ష యోజన స్కీమ్ ని తీసుకు వచ్చారు. ఈ స్కీమ్ వలన చాలా లాభాలు ఉంటాయి.

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఈ స్కీమ్ ని కేంద్రం రెండు భాగాలుగా ఏర్పాటు చేసింది. ఒకటేమో ఎయిమ్స్ తరహా ఇన్‌స్టిట్యూషన్స్‌ను ఏర్పాటు. అంటే ప్రతి ఎయిమ్స్‌లో 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లు, 750 బెడ్స్, 100 యూజీ (ఎంబీబీఎస్) సీట్లు, 60 బీఎస్ఈ (నర్సింగ్ ) సీట్లు, పీజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌పై ఫోకస్, డయాగ్నస్టిక్స్ ఫెసిలిటీస్ ఉంటాయి.

దీని కింద 22 ఎయిమ్స్ ని ఇప్పటి వరకు ప్రకటించింది. అలానే మరో 16 ఎయిమ్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలానే ఈ స్కీమ్ ద్వారా రెండవది వైద్య కాలేజీల అప్‌గ్రడేషన్. ప్రాజెక్ట్ కింద 8 నుంచి 10 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్స్, 15 కొత్త పీజీ సీట్లు, 150 నుంచి 250 బెడ్స్ వంటి వాటిని ఏర్పాటు చేస్తారు.

దీని కింద 75 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. భోపాల్, భువనేశ్వర్, జోద్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రిషికేశ్ పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news