టీఆర్ఎస్ లో చేరాలంటే… సింగిల్ ఫోన్ చాలు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యవహారం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించిన జగ్గారెడ్డి… యూటర్న్ తీసుకున్నారు. 15 రోజుల తరువాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తా అంటున్నారు జగ్గారెడ్డి. అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. టీఆర్ఎస్ లో చేరాలంటే.. సింగిల్ ఫోన్ చాలంటూ.. వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల అపాయింట్మెంట్ ఇప్పించాలని.. తన ఆవేదనను చెప్తా అన్నారు. కేసీఆర్.. మహారాష్ట్ర సీఎంను కలవడం ముఖ్యమైన అంశమే అన్నారు జగ్గారెడ్డి. యూపీఏ కూటమిని చీల్చాలన్నా.. కేసీఆర్ తో సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీతో నేరుగా కొట్లాడుతున్నది మమతా బెనర్జీ, స్టాలిన్ లే అని జగ్గారెడ్డి అన్నారు. దమ్మున్నవారు ఎవరు పార్టీ పెట్టినా.. తెలంగాణలో స్పెస్ ఉందని అన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగ్గారెడ్డితో భేటీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ తరువాత ఢిల్లీ వెళ్లారు. జగ్గారెడ్డి విషయాన్ని అధిష్టానంలో చర్చించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news