తెలంగాణలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గునుగు, తంగేడు వంటి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఉంచి వాటి చుట్టూ పాటలు పాడుతూ కోలాహలంగా జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా కలిసి బతుకమ్మ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా.. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రియాంకా గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి తెలంగాణ ప్రజలతో, తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. 1978లో ఓరుగల్లులో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో తన నానమ్మ ఇందిరా గాంధీ పాల్గొనడం ఒక మధుర స్మృతి అని ఇందిరా గాంధీ తెలిపారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పువ్వులను పేర్చి ఊరూ వాడా కలిసి చేసుకునే పండుగగా బతుకమ్మను అభివర్ణించారు. ఈ పండుగ రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నట్టు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
తెలంగాణా ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణా ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
1978లో ఓరుగల్లు మహిళలతో మా నానమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి. pic.twitter.com/pcJQSEE1Cf
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 27, 2022