బాలయ్యతో రౌడీ హీరోయిన్ రొమాన్స్ !

-

ప్రముఖ నటి, ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియాంక జవాల్కర్ మరాఠీ కుటుంబానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమె పుట్టింది ఏపీలోని అనంతపురం జిల్లాలో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన జవాల్కర్.. ఆ తర్వాత మోడల్‌గా, నటిగా అడుగులు వేశారు. 2017లో వచ్చిన ‘కల వరం ఆయే’ సినిమాతో ప్రియాంక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

 

2018లో హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ట్యాక్సీవాలా’ సినిమాలో ‌హీరోయిన్‌గా నటించారు. ట్యాక్సీవాలా సినిమాతో ప్రియాంక జవాల్కర్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, త్వరలోనే బాలయ్య – అనిల్ రావిపూడి కాంబో లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లో ప్రియాంక జవాల్కర్ కు హీరోయిన్ గా చాన్స్ వచ్చిందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news