ఉత్తర ప్రదేశ్ లో అటవిక పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ మండి పడ్డారు. వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచార కేసులు నమోదవుతున్నా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబానికి పరామర్శించేందుకు ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హత్రాస్ కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో హత్రస్ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించారు. మీడియాను కూడా గ్రామంలో అనుమతించడం లేదు. గుంపులు గుంపులుగా గుమిగూడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హత్రస్ కు రానున్న నేపథ్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. హత్రాస్ జిల్లా బలరాంపూర్ లోని గైసరి గ్రామానికి చెందిన 22 ఏళ్ల దళిత యువతిని కామాంధులు కిడ్నాప్ చేసి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలు పెట్టారు. చికిత్స పొందుతూ మంగళవారం మార్గమధ్యంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.